![]() |
![]() |

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లోని నటుణ్ణి కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రాల్లో `టెంపర్` ఒకటి. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన ఈ కాప్ డ్రామాలో దయ అనే పోలీసాఫీసర్ గా నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో ఎంటర్టైన్ చేశారు తారక్. నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్ ని తన పెర్ఫార్మెన్స్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు ఎన్టీఆర్. ``ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒకడు మీదపడి పోతే.. దండ యాత్ర.. దయ గాడి దండయాత్ర``, ``జీవితం ఎవడ్ని వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తాది..`` వంటి సంభాషణలని తనదైన డైలాగ్ డెలివరీతో పలికి ఆకట్టుకున్నారు తారక్. అలాగే పాటల్లో హుషారైన నృత్యభంగిమలతో అలరించారు.
Also Read: 13 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో విహారయాత్రకు..!
తారక్ కి జోడీగా కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, పోసాని కృష్ణమురళి, రమా ప్రభ, మధురిమ, కోట శ్రీనివాస రావు, సోనియా అగర్వాల్, కోవై సరళ, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిశోర్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వగా.. నోరా ఫతేహి ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించారు. అనూప్ రూబెన్స్ బాణీలు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ నేపథ్య సంగీతం `టెంపర్`కి ప్రధాన బలంగా నిలిచాయి. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మించిన `టెంపర్`.. హిందీలో `సింబా` (2018), తమిళంలో `అయోగ్య` (2019) పేర్లతో రీమేక్ అయింది. 2015 ఫిబ్రవరి 13న విడుదలై విజయం సాధించిన `టెంపర్`.. ఆదివారంతో 7 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |